తనిఖీ, శోధన, స్వాధీనం, నిర్బంధం వివరణ ; డాక్టర్ మారెల్లి విజయకుమార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్
తనిఖీ, శోధన, స్వాధీనం, నిర్బంధం ●'శోధన’ (Search) అనే పదానికి అర్థమేమిటి? ●‘తనిఖీ’(Inspection) అనే పదానికి అర్థమేమిటి? ●‘తనిఖీ’ నిర్వహణకు ఏయే సందర్భాల్లో, ఎవరు ఆదేశించవచ్చు? ●వ్యక్తులకు చెందిన ఆస్తులు/ప్రాంగణాల తనిఖీకి ●నిర్దేశిత అధికారి ఈ సెక్షస్ కింద అనుమతి ఇవ్వవచ్చా? ●'శోధన-స్వాధీనం' కోసం ఎంజీఎల్ నిబంధనల కింద ఎవరు ఆదేశించవచ్చు? 'శోధన’ (Search) అనే పదానికి అర్థమేమిటి? న్యాయశాస్త్ర నిఘంటువు ప్రకారం, వివిధ న్యాయస్థానాల తీర్పుల మేరకు, సాధారణ పరిభాషలో 'శోధన' అంటే... గుప్త సత్యాల వెలికితీత, నేరానికి సాక్ష్యాధారాల అన్వేషణవంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా స్థలం, ప్రదేశాలను సందర్శించి వాటితోపాటు వ్యక్తులు, వస్తువులను సునిశితంగా సోదాచేయడం లేదా శోధించడమని నిర్వచించవచ్చు. ఒక వ్యక్తి లేదా వాహనం లేదా ప్రదేశం వంటివాటి శోధనను సరైన, ప్రామాణిక చట్టబద్ద అధికారంగల సంస్థ మాత్రమే నిర్వహించగలదు. ‘తనిఖీ’(Inspection) అనే పదానికి అర్థమేమిటి? నమూనా జీఎస్టీ చట్టం (MGL) కింద ‘తనిఖీ’ అన్నది కొత్త నిబంధన. ‘శోధన’కన్నాఇది సరళమైనది. పన్ను విధించదగిన వ్యక్తి, వస్తు రవాణా నిర్వా...